మంచి ఆరోగ్యం కోసం చాలా మంది  ఎక్కువ పోషకాలు  ఉన్న పదార్థాల్లో బీట్ రూట్ ను తీసుకుంటారు

కొంతమంది బీట్ రూట్ అంటే ఇష్టపడరు. బీట్ రూట్ ఉపయోగాలు తెలిసిన వారు అవకాశం ఉన్నప్పుడు ఇది తీసుకోకుండా ఉండరు

అయితే బీట్ రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి.. ఈబీట్ రూట్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు బీట్ రూట్ ను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

అలెర్జీతో బాధపడేవారు బీట్‌రూట్ తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వంటివి మరింత తీవ్రమవుతాయి

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీట్‌రూట్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం

బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు బీట్‌రూట్ వినియోగానికి దూరంగా ఉండాలి

బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది