వాము గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మసాలా దినుసుల్లో భాగమైన వామును వంటకాలతో పాటు ఔషధంగానూ వినియోగిస్తూ వస్తున్నాం.

వాము వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదర సంబంధిత సమస్యలు, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వామును విరివిగా వాడుతారు

ఇది అవసరానికి తగినట్లు తింటే మంచిదే.. కానీ, అవసరానికి మించి తింటే మాత్రం పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

ఈ వామును అధికంగా తీసుకోవడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

వామును అధికంగా తీసుకుంటే.. గుండెల్లో మంట తగ్గించడానికి బదులుగా.. యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి

చాలా మందికి అలర్జీ ఉంటుంది. అలర్జీ ఉన్నవారు పొరపాటున వాము తింటే.. తల తిరగడం, వికారం వంటి సమస్యలు వస్తాయి

దీనిని అతిగా తినడం వలన నోట్లో పుండ్లు అవుతాయి. అందుకే వామును మితంగా తీసుకోవాలి

గర్భంతో ఉన్నవారు వాముకు దూరంగా ఉండటం మంచిది. వాము.. పిండం అభివృద్ధిని అడ్డుకుంటుంది