డీజే టిల్లు సక్సెస్ తో ఓవర్ నైట్ లో సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ మారిపోయింది.
ప్రస్తుతం సిద్ధు అనుపమతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
టిల్లు స్క్వేర్ సినిమాకు సిద్ధు 3.5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సిద్ధు సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోంది.
చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
బంగార్రాజు సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో చిరంజీవి కొడుకు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ కనిపించనున్నారు.
ఈ సినిమా కోసం సిద్ధు జొన్నలగడ్డ ఏకంగా 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
సిద్ధు జొన్నలగడ్డ కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తే స్టార్ హీరో స్టేటస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.