గిల్ దెబ్బకు వన్డే చరిత్రకు బీటలు.. హైదరాబాద్‌లో రికార్డుల వర్షం..

గిల్ తన వన్డే కెరీర్‌లో మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

శుభ్‌మన్ గిల్ ఈ ఇన్నింగ్స్‌లో 106 పరుగులు చేసిన వెంటనే వన్డే క్రికెట్‌లో 1000 వేల పరుగులు పూర్తి చేశాడు.

ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

గిల్ 19 వన్డేల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 1000 వన్డే పరుగులు పూర్తి చేశాడు.

గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ పేరిట ఉండేది.

విరాట్ 27 మ్యాచ్‌ల్లో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించాడు.

ధావన్ 24 మ్యాచ్‌ల్లో 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును అందుకున్నాడు.

ఇక ఈ రికార్డులో ఫకార్ జమాన్ 18 ఇన్నింగ్స్‌ల్లో చేరుకుని అగ్రస్థానంలో నిలిచాడు.

19 ఇన్నింగ్స్‌లతో ఇమామ్ ఉల్ హక్, శుభ్మన్ గిల్ రెండో స్థానంలో నిలిచారు.

ఇక మూడో స్థానంలో వివ్ రిచర్డ్స్, కెవిన్ పీటర్సన్, జొనాథన్ ట్రోట్, క్వింటన్ డికాక్, బాబార్ అజామ్, డుస్సెన్ 21 ఇన్నింగ్స్‌లతో చేరుకున్నారు.