‘‘మంచు ప్రదేశాల్లో డ్యాన్స్‌ చేసేటప్పుడు హీరోలు కోటు, శాలువా వంటివి వేసుకోవడానికి ఆస్కారముంటుంది కానీ, నాయికలకు ఆ అవకాశం ఉండదు.

వాళ్లు కేవలం చీరను మాత్రమే ధరించాలి’’ అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్‌ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో ఆమెను కొందరు విమర్శలు కూడా చేశారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది శృతిహాసన్.

‘‘ప్రస్తుతం నా జీవితంలో నేను అత్యున్నత దశలో ఉన్నాను. ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఎంతో గొప్పగా ఎదుగుతున్నా.

నా జీవితం ఇంత అందంగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. వీటన్నింటితో పాటు నాకు ఓ విషయం అర్థమైంది.

మనల్ని అపార్థం చేసుకునే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. అలాగే ప్రేమను చూపించే వాళ్లూ ఉంటారు’’ అని తన ట్వీట్‌లో పేర్కొంది శ్రుతి.

ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో అలరించిన శృతి ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రంతో ఈ ఏడాది సెప్టెంబరు 28న మరోసారి అలరించనుంది.