మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు బడా మూవీస్ బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య. ఈ రెండు  సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి.

‘వీరసింహారెడ్డి’ జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ రెండు చిత్రాలలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయిగా నటించింది. తాజాగా శ్రుతి హాసన్. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల విశేషాలని పంచుకున్నారు.

నిజానికి ఇది నేను ఊహించలేదు. నా కెరీర్ లో ఇలా జరగడం రెండోసారి. ఏడేళ్ళ క్రితం నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి.

చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఒక సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు లాంటి ఇద్దరు లెజెండరీ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి.

చాలా ఆనందంగా వుంది. ఈ విషయంలో చాలా అదృష్టంగా ఫీలౌతున్నా అని అంది. అలాగే రెండు భిన్నమైన కథలు. భిన్నమైన పాత్రలు. వీరసింహా రెడ్డిలో నా పాత్ర ఫన్ ఫుల్ గా వుంటుంది.

వాల్తేరు వీరయ్యలో కంప్లీట్ డిఫరెంట్. రెండు పాత్రలు సవాల్ తో కూడుకున్నవి. వాల్తేరు వీరయ్యలో నా పాత్రని దర్శకుడు బాబీ చాలా చక్కగా డిజైన్ చేశారు.

వీరసింహారెడ్డి విషయానికి వస్తే నా పాత్రలో కామెడీ వుంటుంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఏ పాత్రకు ఆ పాత్రే ప్రత్యేకం.