శ్రియ శరన్ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది
20 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ మూవీలో కనిపించనుంది
గతంలో శ్రియ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి
పెళ్లి తర్వాత కూడా మీరు అందంగా ఉండటానికి కారణం ఏంటని.. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కాస్త గట్టిగానే కౌంటరిచ్చింది
హీరోయిన్లను మాత్రమే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు?.. ఇలాగే హీరోలను అడిగే ధైర్యం మీకుందా?
అందం ఒక్కటే ముఖ్యం కాదు. నా వయసు.. నేను ఇండస్ట్రీలో ఎంత కాలం నుంచి ఉన్నాను.. అనేది ముఖ్యం
ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకుందా? ఇదే ప్రశ్న హీరోలను అడిగిన రోజున నేను దీనికి సమాధానం చెబుతా.. అంటూ శ్రియ బదులిచ్చింది