2001లో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార శ్రియ.
అనతి కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకుంది
టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన శ్రియ తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకుంది.
ఓవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిందీ చిన్నది.
తాజాగా దృశ్యం-2 మూవీలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిందీ బ్యూటీ.
దృశ్యం2 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
‘నా కూతురు ‘రాధ’ కడుపులో ఉన్న అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలనుకున్నాను. లావుగా అవుతుండడంతో దాని గురించి చింతించాల్సి వచ్చింది
అభిమానులకు, మీడియాకు ఈ విషయం తెలిస్తే నా బాడీ షేప్ గురించి రాస్తారు. నా బిడ్డపై దృష్టి పెడతారు.
ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి సమయాన్ని వృథా చేయాలనుకోలేదు’ అని తన ప్రెగ్నె్న్సీ విషయాన్ని బయట పెట్టకపోవడానికి గల అసలు కారణం తెలిపింది.