త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'
ఈ సినిమాలో తరుణ్, శ్రియ జంటగా నటించారు.
ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ నెల 10వ తేదీకి నువ్వే నువ్వే సినిమా విడుదలై 20 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు.
ఈ సందర్భంగా వేదికపై పాత స్మతుల్ని నెమరవేసుకున్నారు హీరోయిన్ శ్రీయ.
త్రివిక్రమ్, రవికిశోర్ గారు నా కోసం దిల్లీ వచ్చారు. తరుణ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ సినిమా మర్చిపోలేని జ్ఞాపకం అని చెప్పారు శ్రీయ.
శ్రియ మాట్లాడుతున్న టైంలో కాకపోతే ఆమెకి పెళ్లయిపోయింది, కూతురు కూడా ఉందని తరుణ్ ఓ కామెంట్ వదిలాడు.
దీంతో పెద్దగా నవ్వేసిన శ్రీయ.. తన కోస్టార్ తరుణ్‌ని స్టేజీపై అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టేసింది.