బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నటి శ్రద్ధా కపూర్‌.

పేరుకు తండ్రి వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుందీ చిన్నది.

అనతి కాలంలో బాలీవుడ్‌లో ప్రముఖ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ‘ఆషికీ-2’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది.

ఇక తెలుగులో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం మెస్మరైజ్‌ చేసింది.

వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ అమ్మడు..