బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన హారర్ కామెడీ మూవీ ‘స్త్రీ’
అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 125కోట్ల వసూళ్లను రాబట్టి మంచి విజయం అందుకుంది
తాజాగా ఈ ఫ్రాంచైజీలో ‘స్త్రీ 2’ చిత్రాన్ని అమర్ కౌశిక్, దినేష్ విజన్ జూలైలో ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడుక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి
‘స్త్రీ’ చిత్రాన్ని నిర్మించిన మ్యాడ్‌డాక్ మూవీ ప్రొడక్షన్ సంస్థకి ఓ మైలురాయి
ఈ చిత్రం కంటే మెరుగైన చిత్రంగా ‘స్త్రీ 2’ని తెరకెక్కిచానున్నట్లు తెలిపారు మూవీ మేకర్స్
ఈ రెండో భాగంలో కూడా శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు
‘భేడియా’ తరహా పాత్రతో బాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్‌ధావన్ ఈ చిత్రంలో ప్రత్యేకంగా అలరించనున్నారు