పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తన పేస్‌ బౌలింగ్‌తో పాక్‌కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు.

అతని స్పీడ్‌ను తట్టుకుని నిలబడ్డ బ్యాటర్లు చాలా తక్కువమందే ఉన్నారు.

 అక్తర్‌ తన హైటైమ్‌లో ఎంతో మంది బ్యాట్స్‌మెన్లను వణికించాడు.

కానీ.. ఒక్క భారత బ్యాటర్‌ మాత్రం తనను సమర్థవంతంగా ఎదుర్కొనే వాడని తెలిపాడు.

అతను మరెవరో కాదు.. టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌.

దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్‌ టెండూల్కర్‌ ఎందరో బౌలర్లను ఎదుర్కొన్నాడు.

సచిన్‌ వికెట్‌ తీస్తే చాలు జన్మధన్యమైనట్లే అని భావించే బౌలర్లు ఎందురో.

మరి అలాంటి ఆటగాడికి అక్తర్‌ లాంటి బౌలర్‌ను ఎదుర్కొవడం పెద్ద విషయం కాదు.