టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. చాలా కాలంగా శర్వానంద్ ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

అప్పుడప్పుడే వచ్చిన మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న శర్వా.. ఆ తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని తిరిగి అందుకోలేకపోయాడు. 

ఇప్పుడు ఒకేఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శర్వా. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్రలో కనిపించారు. 

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రీతువర్మ నటించింది.

ఇక ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 10న ఈ సినిమా ఓటీటీ వేదికగా రానుందని తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ లో ఒకేఒక జీవితం సినిమా రిలీజ్  అవుతుంది.

థియేటర్స్ లో డీసెంట్ హిట్ గా నిలిచినఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.