‘ఒకే ఒక జీవితం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న హీరో శర్వానంద్ కొత్త మూవీ కోసం రంగంలోకి దిగారు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై శర్వా 35వ చిత్రం తెరకెక్కుతుంది
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత
సోమవారం శర్వానంద్ పుట్టినరోజుని సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం
ఈ నేపథ్యంలో శర్వా లుక్నీ విడుదల చేశారు మూవీ మేకర్స్
ఆసక్తికరమైన కలయికలో, అంతే ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న సినిమా ఇది
శర్వానంద్ లుక్ స్టైలిష్గా ఉంటుంది. దీనికోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు
ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోందని ప్రకటించాయి సినీవర్గాలు