ప్రామిసింగ్ హీరో శర్వానంద్ వైవిధ్యమైన సినిమాలతో ముందుకు వెళ్తున్నారు.
‘ఒకే ఒక జీవితం’ తర్వాత కాస్త విరామం తీసుకున్న శర్వానంద్ కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు.
ఆయన 35వ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత.
శర్వానంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని సోమవారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
ఈ సందర్భంగా శర్వానంద్ లుక్‌నీ విడుదల చేశారు. ‘‘ఆసక్తికరమైన కలయికలో, అంతే ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న సినిమా ఇది.
ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్న శర్వానంద్ ఇందులో సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు.
శర్వానంద్ లుక్ స్టైలిష్‌గా ఉంటుంది. దీనికోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోందని సినీవర్గాలు తెలిపాయి.