కంపెనీలు STOCK SPLIT ఎందుకు చేస్తాయో తెలుసా?
04 September 2023
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు మంచి రాబడి కావాలని చాలారకాలైన విధానాలను ఫాలో అవుతారు. వీటిలో ఒకటి స్టాక్ స్ప్లిట్.
స్టాక్ స్ప్లిట్ అంటే ఒక స్టాక్ విభజన జరగడం అని చెప్పవచ్చు. సాధారణంగా కంపెనీలు తమ షేర్లను విభజిస్తాయి. ముఖ్యంగా పెద్ద కంపెనీలు ఈ పని చేస్తాయి.
ఎందుకంటే షేర్ ధర ఎక్కువగా ఉంటె చాల మంది చిన్న ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టె ముందు వెనక్కి తగ్గుతారు.
చిన్న ఇన్వెస్టర్స్ ని నిలుపుకోవడం అలాగే ఎఫర్డబిలిటీని నిలబెట్టు కోవడం కోసం స్టాక్ స్ప్లిట్ చేస్తాయి కంపెనీలు.
ఇది ఎలా ఉంటుందంటే.. 1:1 స్టాక్ స్ప్లిట్ లో స్టాక్ హోల్డర్ దగ్గర ఉన్న ఒక్కో షేర్ రెండుగా విభజన అవుతుంది.
దీనివలన షేర్ల సంఖ్య పెరుగుతుంది అంతే. స్టాక్ విలువ మాత్రం అలానే ఉంటుందని అందరు తెలుసుకోవలసిన విషయం.
అంటే ఎవరి దగ్గర అయినా ఒక కంపెనీకి చెందిన 100 షేర్లు ఉంటె అవి 200 అవుతాయని ఇన్వెస్టర్స్ అర్ధం చేసుకోవాలి.
ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. స్టాక్ స్ప్లిట్ తో కేవలం షేర్ ఫేస్ వాల్యూ తేడా ఉంటుంది. అంతే తప్ప పెట్టుబడిపై ఎఫెక్ట్ ఏమీ ఉండదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి