భారత్‌పై స్పెషల్ రికార్డ్ సృష్టించిన బంగ్లా స్టార్ స్పిన్నర్.. లిస్టులో మరో 7గురు..

బంగ్లాదేశ్ పర్యటనలో తొలి వన్డేలోనే టీమిండియా ఘోర ఓటమిపాలైంది.

ఆదివారం జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఒక వికెట్‌ తేడాతో ఘనవిజయం సాధించింది.

మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో బంగ్లాదేశ్ ఆధిక్యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్ హసన్‌  10 ఓవర్లలో 36 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ఇందులో 2 మెయిడిన్‌లు ఉన్నాయి. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీలను పెవిలియన్ చేర్చాడు.

దీంతో టీమిండియాపై అరుదైన రికార్డ్ సాధించాడు.

వన్డేల్లో టీమ్‌ఇండియాపై 5 వికెట్లు పడగొట్టి తొలి బంగ్లా స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు.

మొత్తంగా టీమిండియాపై ఈ ఘనత సాధించిన 8వ స్పిన్నర్‌గా షకీబ్‌ నిలిచాడు.

అంతకుముందు ముస్తాక్‌ అహ్మద్‌, సక్లైన్ ముస్తాక్, ముత్తయ్య మురళీధరన్‌,యాష్లే గైల్స్, అజంతా మెండిస్‌, సయీద్ అజ్మల్, అకిల ధనంజయ భారత్‌పై ఈ ఘనత సాధించారు.