ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది సినిమాలు చాలా అద్భుతంగా ఉండడంతో దక్షిణాది సినిమాలకు మంచి క్రేజ్ కూడా పెరిగిపోయింది.

ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తెలుగు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు షాహిద్ కపూర్.

తాజాగా బ్లడీ డాడీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.

డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ సినిమా 2011లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ స్లీప్ లెస్ నైట్ చిత్రానికి అడాప్షన్ గా తెరకెక్కుతుందని సమాచారం..

ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా షాహిద్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలుస్తుంది.

ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనని యాంకర్ ప్రశ్నిస్తూ మీకు కనుక హాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తారా అంటూ ఆయనను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు షాహిద్ కపూర్ సమాధానం చెబుతూ తాను హాలీవుడ్ సినిమా అవకాశాలు వస్తే ఏ మాత్రం కూడా నటించనని తెలిపారు.

హాలీవుడ్ సినిమాలలో మనకు ప్రాధాన్యత లేని పాత్రలలో అవకాశాలను ఇస్తారు.

అందుకే తాను హాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది ఇండస్ట్రీలో ని తెలుగు తమిళ భాషలలో అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానని తెలిపాడు.