ఆమె వందల సినిమాల్లో నటించింది. విభిన్న పాత్రల్లో మెప్పించి.. విలక్షణ నటిగా పేరు సంపాదించుకుంది. హస్య ప్రధాన పాత్రల్లో మనల్ని ఎంతో నవ్వించిన ఆమె చాలాకాలంగా దు:ఖంలో ఉంది.
అయ్యో అని అనేవారే తప్ప.. అక్కున చేర్చుకునేవారు లేరు. దీంతో కుమార్తెలో కలిసి.. బతుకు నెట్టుకొస్తోంది. ఆమె ఎవరో కాదు. పావలా శ్యామల.
ఆమెకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఆమె కుమార్తెకు కూడా బాగా సుస్తి చేసి మంచానికే పరిమితమైంది. దీంతో సినిమాలకు దూరమైంది.
తనను, తన బిడ్డను చూసుకోడానికి ఎవరూ లేరని వాపోయింది.
గతంలో మెగాస్టార్ చిరంజీవి మంచి మనసుతో లక్ష రూపాయలు కట్టి.. తనకు ‘మా’ లో సభ్యత్యం ఇప్పించారని.. ఖర్చుల కోసం మరో రెండు లక్షలు ఇచ్చారని తెలిపింది.
అప్పట్లో అందరూ చేసిన సాయంతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చామని.. మళ్లీ పాత రోజులు వచ్చాయని వెల్లడించింది.