‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ హిట్స్ తర్వాత నాగశౌర్య - శ్రీనివాస్ అవసరాల కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’
మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు
ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది
ఈ చిత్రంలోని రెండో గీతాన్ని సోమవారం విడుదల చేశారు మూవీ మేకర్స్
‘ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా..’ అంటూ సాగే ఈ సాంగ్ ని నూతన మోహన్, స్వరకర్త కల్యాణి మాలిక్ పాడారు
నాయకానాయికల పరిచయం గీతం ఇది. వారిద్దరూ ఎవరు? ఎలా పరిచయమయ్యారు? ఆల కలిసిన తర్వాత వాళ్లిద్దరి మధ్య ఎలాంటి బంధం పెనవేసుకుంది?
ఆ బంధం ఎలా సాగిందనే విషయాల వెనక భావాలు ఈ పాటలో వినిపిస్తాయి. నేను రాసిన మరో మంచి గీతం ఇది
‘జ్యో అచ్యుతానంద’ తర్వాత శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాటలు రాయడం సంతోషంగా ఉంది అని అన్నారు గీత రచయిత భాస్కరభట్ల