చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ పాప్‌కార్న్ అంటే ఇష్టం
ఇదిలా ఉంటే.. మీరు పాప్‌కార్న్ ఉడుకుతున్నప్పుడు తప్పకుండా చూసే ఉంటారు
మొక్కజొన్న గింజలు వికసించిన వెంటనే పేలుతుంటాయి.. ఎగిరిపడుతుంటాయి. ఆ తర్వాతే పాప్ కార్న్ సిద్దమవుతుంది
మరి అసలు పాప్‌కార్న్ వేడి చేసినప్పుడు ఎందుకలా చిటపటలాడుతుందో తెలుసా
మొక్కజొన్న గింజలను 170°C వరకు వేడి చేసినప్పటికీ, అందులోని 30 శాతం మాత్రమే పాప్‌కార్న్‌గా మారతాయి
అదే సమయంలో, 90 శాతం పాప్‌కార్న్‌ను ఉడికించడానికి 180°C ఉష్ణోగ్రత అవసరం
మొక్కజొన్నలో 10 నుంచి 20 శాతం వరకు నీరు ఉంటుంది. దాన్ని వేడి చేసినప్పుడు, ఒత్తిడి పెరుగుతుంది
తద్వారా నీరు ఆవిరి అవుతుంది. దీనితో చిటపటలాడటం ప్రారంభమవుతుంది
మొక్క జొన్న గింజల లోపల ఒత్తిడి పెరగడం వల్ల అవి వేగంగా పేలుతాయి
కొంతమంది శాస్త్రవేత్తలు అయితే మొక్క జొన్నలోని పిండి పదార్ధం కారణంగా అవి చిటపటలాడతాయని అంటారు