దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ సరికొత్త ఎకౌంట్ విధానం ప్రవేశపెట్టింది. అదే 3 ఇన్ 1 ఎకౌంట్. పేరుకు తగ్గట్టుగానే మీరు బ్యాంకులో మూడు రకాల ఎకౌంట్లను ఒకటే ప్యాకేజీ కింద ప్రారంభించవచ్చు.

సేవింగ్స్ ఎకౌంట్, డీ మ్యాట్ ఎకౌంట్, ట్రేడింగ్ ఎకౌంట్ మూడింటినీ ఒకేసారి ఒకే ప్యాకేజీలా ప్రారంభించే అవకాశం ఎస్బీఐ కల్పిస్తోంది. 

ఈ ఖాతా ప్రారంభించడానికి కస్టమర్లు బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన పనిలేదు. ఇది పేపర్‌లెస్‌గా ప్రారంభించ వచ్చు. 

ఈ విషయాన్ని ఎస్బీఐ తన అధికారిక ట్వీట్ లో "3-in-1 యొక్క శక్తిని అనుభవించండి! మీకు సులభమైన మరియు కాగితం రహిత వ్యాపార అనుభవాన్ని అందించడానికి సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా మరియు ట్రేడింగ్ ఖాతాలను మిళితం చేసే ఖాతా" అని పేర్కొంది. 

సేవింగ్స్ ఖాతా లేదా డీమ్యాట్ & ట్రేడింగ్ ఖాతాను తెరవడం కోసం పాన్ లేదా ఫారం 60, పాస్‌పోర్ట్ సైజు ఫోటో కావాలి, దీనితో పాటు పాస్‌పోర్ట్, ఆధార్ కలిగి ఉన్నట్లు రుజువు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID కార్డ్ లలో ఎదో ఒక చిరునామా రుజువు అందించాల్సి ఉంటుంది.