విమానంలో ప్రయాణం సమయం ఆదా చేయడమే కాకుండా చాలా మందికి తప్పనిసరి కూడాను

విమానంలో ప్రయాణించేటపుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. తోటి ప్రయాణీకులతో.. విమాన సహాయ సిబ్బందితో పద్ధతిగా వ్యవహరించాల్సి ఉంటుంది

ఒకవేళ పధ్ధతి తప్పితే విమానం నుంచి దించివేయడమే కాకుండా.. ఒక్కోసారి బ్లాక్ లిస్టులో పెట్టె ప్రమాదం కూడా ఉంటుంది

మీరు తాగి విమానం ఎక్కలేరు. కానీ, విమానంలో మద్యం తాగడానికి మీకు అనుమతి ఉంటుంది. అది మీరెక్కిన విమానంలో మద్యం అందుబాటులో ఉన్న పరిస్తితిలోనే సాధ్యం అవుతుంది

ఇక ఒకవేళ మీరు విమాన ప్రయాణంలో ఉండగా.. విమాన సిబ్బంది లేదా తోటి ప్రయాణీకులకు మీరు మద్యం తాగి ఉన్నాను అని జోక్ గా చెప్పినా అది తీవ్రంగా పరిగణిస్తారు

ఆ మాట అన్నవెంటనే.. దగ్గరలోని విమానాశ్రయంలో విమానం ఆపించి మరీ కిందకు దించేస్తారు

మీరు ఈ మాట ఫ్లైట్ అటెండెంట్‌తో కనుక అంటే, మీకు లక్షరూపాయల జరిమానాతో పాటు.. మూడేళ్ళు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది

తాగిన ప్రయాణికులను విమానం ఎక్కకుండా ఆపడానికి క్యాబిన్ సిబ్బంది.. విమాన సహాయకులకు హక్కు ఉంటుంది