ఈ సంక్రాంతికి ‘వారసుడు’తో ప్రేక్షకులను పలకరించారు తమిళ స్టార్‌ విజయ్‌

ప్రస్తుతం విజయ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో  ‘లియో’ మూవీలో నటిస్తున్నారు

త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు

ఈ సినిమాలో  సంజయ్‌ దత్‌ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే

ఆయన తాజాగా శనివారం ఈ చిత్ర సెట్లోకి అడుగు పెట్టారని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది

దీనికి సంబంధించి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు మూవీ మేకర్స్

గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ షూటింగ్ కశ్మీర్‌లో శరవేగంగా జరుగుతోంది

ఈ సినిమాలో గౌతమ్‌ మేనన్‌, అర్జున్ సర్జ, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు