11 August 2024

తండ్రి మీద కోపంతో పేరు మార్చుకున్న హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ మలయాళం బ్యూటీ సంయుక్తా మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది. 

వరుస హిట్స్ అందుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత క్రేజ్ పెరిగింది. కానీ ఆ తర్వాత ఈ హీరోయిన్ స్పీడ్ తగ్గిపోయింది. 

గతేడాది నాలుగైదు సినిమాలతో అలరించిన హీరోయిన్.. ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకుండా రిలాక్స్ అవుతుంది. 

కొత్త సినిమాల విషయంలో అచితూచి అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే సంయుక్త మీనన్ కొత్త సినిమాలకు సైన్ చేయలేదని తెలుస్తోంది. 

ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ స్వయంభూ సనిమాలో నటిస్తోంది. తాజాగా బాలీవుడ్ ఆఫర్ అందుకుంది సంయుక్త. 

ఈ బ్యూటీ పేరు సంయుక్త మీనన్ నుంచి మీనన్ పేరును తొలగించింది. అమ్మ నాన్న విడిపోయారని.. అమ్మ అంటే చాలా ఇష్టమని తెలిపింది.

తన ఫీలింగ్స్ అన్నింటిని గౌరవించి పేరులో నుంచి సర్ నేమ్ తీసేసినట్లు చెప్పుకొచ్చింది. స్త్రీ, పురుషులు సమానం అని నమ్ముతానని తెలిపింది.