శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం55 5జీ ఆవిష్కరణ..

09 April 2024

TV9 Telugu

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ సోమవారం తన ఎం సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది.

శాంసంగ్‌ మొబైల్‌

శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 

శాంసంగ్ గెలాక్సీ ఎం55

దీంతో పాటు శాంసంగ్ ఎం15 5జీ (Samsung Galaxy M 15 5G) స్మార్ట్‌ ఫోన్ కూడా ఆవిష్కరించింది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది.

మరో మొబైల్‌

ఈ రెండు ఫోన్లను ఇంతకుముందే గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ పెట్టింది. శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ ఫోన్ ఒక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది.

రెండు మొబైళ్లు

మూడు ర్యామ్ + స్టోరేజీ వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతు, ట్రిపుల్ రేర్ కెమెరా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

స్టోరేజీ

శాంసంగ్ గెలాక్సీ ఎం 55 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999 ఉండనున్నాయి.

ధర

8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999లకు లభిస్తాయి. 

మరో వేరియంట్‌

అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌ల్లో ఫోన్లు బుక్ చేసుకోవచ్చు. డెనిమ్ బ్లాక్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

)ఆన్‌లైన్‌లో