నిజ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన సరే వాటిని బలంగా మలచుకొని ముందుకు వెళ్తుంది సమంత
ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు.. తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడింది సామ్
ఇలా మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చిన మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా అన్నింటిని ఎదుర్కొంది
ఇప్పుడు రెట్టింపు ఉత్సహాంతో మళ్లి సినిమాల్లో నటన మొదలుపెట్టింది
చాలా రోజులకి ఇప్పుడు మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రానుంది సామ్
ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది
దీని తర్వాత సామ్ విజయ్‌దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ మూవీలో నటించనుంది
ఇన్నాళ్లు అనారోగ్యంతో ఇంట్లోనే ఉన్న సామ్ ఇప్పుడు షూటింగ్‌లో పాల్గొనడంతో అభిమానులు చాల సంతోషంగా ఉన్నారు
కాగా, సీటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కారులో వెళ్తూ కళ్లు మూసుకొని ఓ ఫోటోని ఇంస్టాలో ‘find the light’ అని ఓ క్యాప్షన్ తో షేర్ చేసింది