సమంత గొప్ప నటి మాత్రమే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా.

టాలీవుడ్‌ లో కొంతమంది సెలబ్రిటీలు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్యాన్స్‌ కి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ లిస్ట్‌ లో సమంత కూడా ఉంది. ప్రత్యూష అనే ఫౌండేషన్‌ ను స్టాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

తన చారిటీ ద్వారా సమంత ఎంతో మంది అనాధలకు వృద్ధులకు సేవలు అందిస్తోంది.

అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రముఖ ఆస్పత్రులతో కలిసి..

 ప్రాణాంతక వ్యాధులతో బాధపడే మహిళలు, చిన్నారులకు వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.

అందుకే సమంత గొప్ప మనసు గురించి తెలిసినవారు శభాష్‌ అనకుండా ఉండలేరు.

కాగా, సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన "శాకుంతలం' వచ్చే నెలలో విడుదల కాబోతోంది.