సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం సంస్కృత నాటకం ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది
ఈ చిత్రంలో సమంత శకుంతలగా.. దేవ్‌మోహన్ దుష్యంతుడిగా నటించారు
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ టీమ్ బ్యానర్‌పై నీలిమ గుణ, నిర్మాత దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు
కీలక పాత్రలలో మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్, మధుబాల, గౌతిమి నటిస్తున్నారు
కాగా శాకుంతలం చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోమవారం ప్రకటించింది
ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు విజువల్ వండర్‌గా త్రీడీలోనూ రూపొందిస్తున్నట్టు మూవీ మేకర్స్ తెలిపాయి