సమంత, నాగచైతన్య జీవితంలో ఏ మాయ చేసావె సినిమా సినిమా నిజంగానే మాయ చేసింది.

ఇద్దరి కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమాతోనే వారి ప్రేమ ప్రయాణం మొదలైంది.

ఈ జంటను చూసి ముచ్చటపడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. పెళ్లి తర్వాత మజిలీ చిత్రంతో మరోసారి మెప్పించారిద్దరూ.

కానీ ఎవరి కన్ను కుట్టిందో ఏమో కానీ 2021 అక్టోబర్‌లో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు.

ఈ నిర్ణయంతో అభిమానుల మనసు ముక్కలైంది. ఎంతగానో అభిమానించిన జంట ఇక మీదట కలిసి ఉండబోదని తెలిసి తీవ్ర నిరాశకు లోనయ్యారు ఫ్యాన్స్‌.

విడాకుల తర్వాత సమంత పుష్పలో ఊ అంటావా సాంగ్‌ చేయడంపై ఆమెపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది.

తాజాగా చైతో విడాకులు, తనపై జరిగిన ట్రోలింగ్‌పై స్పందించింది సామ్‌. 'అవి నా జీవితంలో చీకటి రోజులు.. పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తుండేవి.

ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. నా మనసుకు నచ్చినట్లు రియాక్ట్‌ అయ్యా. ముందడుగు వేశా.

అదృష్టం ఏంటంటే కుటుంబ సభ్యులు, మిత్రులు చాలామంది నాకు అండగా నిలబడ్డారు.

కానీ ఇప్పటికీ ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నా. కాకపోతే ముందుతో పోలిస్తే ఆ చీకటి రోజులు కొంత తగ్గాయి.

క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిలోనే మనం చిక్కుకుని ఉండిపోకూడదు' అని చెప్పుకొచ్చింది సామ్‌.