సిటాడెల్‌ సిరీస్‌ కు సమంత పారితోషికం తెలిస్తే షాకే !!

ఏమాయ చేశావె చిత్రంతోనే కుర్రకారును బుట్టలో వేసుకునంది సమంత. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది.

ఏమాయ చేశావె చిత్రంతోనే కుర్రకారును బుట్టలో వేసుకునంది సమంత.

తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది.

సూపర్‌ డీలక్స్‌ చిత్రంలో ఏ నటి నటించడానికి సాహసించని పాత్రను పోషించి తన ప్రత్యేకతను చాటుకుంది.

అదేవిధంగా ఫ్యామిలీ మెన్‌ 2 అనే హిందీ వెబ్‌సీరీస్‌లో యాక్షన్‌ సన్నివేశాల్లో ఇరగదీసి ఆ సిరీస్‌ విజయానికి ముఖ్య కారణంగా నిలిచింది.

అయితే కొంతకాలంగా సమంతకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోంది.

చైతో విడాకులు.. మయోసైటిస్‌ అనే వింత వ్యాధి బారిన పడడం, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన శాకుంతలం చిత్రం డిజాస్టర్‌గా నిలవడం పలు బాధాకరమైన సంఘటనలు సమంతను చుట్టుముట్టాయి.

అలాంటి వాటిని ఎదురొడ్డి నిలబడి తన సినీ కెరీర్‌ను మరింత హైలెవెల్‌కు తీసుకుపోతోందీ హీరోయిన్‌.

కానీ సమంత విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంది. తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగులో విజయదేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తూనే బాలీవుడ్‌లో సిటాడెల్‌ వెబ్‌సీరీస్‌ చేస్తోంది.

ఈ వెబ్‌సీరీస్‌లో నటించడానికి సమంత అక్షరాల రూ.10 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అందుకే సమంత లెవలే వేరు అంటున్నారు అభిమానులు.