సమంత మాట్లాడుతూ "వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే నాకు 'పుప్ప'లో 'ఊ అంటావా' ఆఫర్ వచ్చింది.
నేనే తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలనిపించింది. వెంటనే దాన్ని ఓకే చేసేశాను.
ఆ పాటను అనౌన్స్ చేసినప్పుడు కుటుంబసభ్యులు, తెలిసినవాళ్లు ఫోన్లు చేసి.. "ఇంట్లో కూర్చో చాలు.
విడిపోయిన వెంటనే నువ్వు ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదు" అని సలహాలు ఇచ్చారు.
నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు కూడా ఆ పాటను చేయొద్దనే అన్నారు. కానీ నేను దాన్ని అంగీకరించలేదు.
ఎందుకంటే.. వైవాహిక బంధంలో నేను 100శాతం నిజాయతీగా ఉన్నాను. కాకపోతే అది వర్కౌట్ కాలేదు.
అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలి.?
నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని, ఎందుకు బాధపడాలి అంటూ సమంత చెప్పకొచ్చింది.