టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే.
ఆమె అరుదైన చర్మ సమస్యతో బాధపడుతుందని చికిత్స కోసం విదేశాలకు వెళ్లబోతుదంటూ నెట్టింట రూమర్స్ చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తలపై సామ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.సమంత ప్రస్తుతంత ఆరోగ్యంగానే ఉన్నారని.
సామ్ నెమ్మదిగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ నెట్టంట షేర్ చేస్తూ వచ్చింది. శాకుంతలం, యశోద అప్డేట్స్ షేర్ చేస్తూ మళ్లీ యాక్టివ్ అయ్యింది.
అటు బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతుంది సామ్. వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ ఇండియా అనే వెబ్ సిరీస్ చేయనుంది.
చాలా కాలం తర్వాత తాజాగా సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తన పెంపుడు శునకం ఫోటోను షేర్ చేస్తూ.. ” వెనక్కు తగ్గాను.. కానీ ఓడిపోలేదు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె చేసిన ఇప్పుడు వైరలవుతుంది.