టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు

ఇటీవల సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ తగ్గేదేలేదంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది సమంత. శాకుంతలం, ఖుషి చిత్రాలను నటిస్తోంది.

ఇక ఈ తరుణంలోనే సమంత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

అగ్రకథానాయిక సమంత నటిగా తాను తొలి అడుగు వేసి 13 ఏళ్లు అయిన సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

“నేను ఎంత ఎదిగినా, ఎంత దూరం ప్రయాణించినా, మీరు చూపించే ప్రేమాభిమానాన్ని మర్చిపోలేను. నాపై ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు.

అలాగే, కొత్త విషయాలను పరిచయం చేస్తున్న ప్రతి రోజుకు కృతజ్ఞతలు. గతంలో ఎన్నో విషయాలు నన్ను బాధించేవి.

కానీ, ఇకపై కాదు. కేవలం ప్రేమ, కృతజ్ఞతతో కొనసాగుతున్నా” అని సమంత రాసుకోచ్చారు.