ఈ నెల 14న ‘శాకుంతలం’ చిత్రం విడుదల హైదరాబాద్‌లో జరిగిన సమావేశనికి హాజరయ్యారు హీరోయిన్  సమంత.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు నా లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్స్‌ లేవు. సో.. నేను చాలా సింపుల్‌గా, హ్యాపీగా ఉన్నాను.

కానీ నా జీవితంలో నేను కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరైనా తమ జీవితాల్లో స్ట్రగుల్స్‌ను ఫేస్‌ చేసినప్పుడు వారు స్ట్రాంగ్‌గా మారిపోతుంటారు.

నేనూ అంతే. నన్ను నేను ప్రత్యేకం అనుకోవడం లేదు. అయితే నా జీవితంలో నాకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి.

ఇవి నా జీవితాన్ని నాశనం చేయకూడదని అనుకుని, ఇందుకు తగ్గట్లుగా జీవితంలో ముందుకెళుతున్నాను’’ అని తెలిపింది సామ్

‘‘శాకుంతలం’ పూర్తి కథ విని నేను సర్‌ప్రైజ్‌ అయ్యాను. భారతీయ సాహిత్యంలో ఎంతోమంది ప్రేమించే శకుంతల పాత్రను పోషించడం నాకు పెద్ద బాధ్యతగా అనిపించింది.

‘ది ఫ్యామిలీ మేన్‌ 2’ వెబ్‌సిరీస్‌లో రాజీవంటి క్యారెక్టర్‌ చేసిన నేను వెంటనే శకుంతల  పాత్ర చేయడానికి తొలుత భయపడి నో చెప్పాను.

కానీ శకుంతల హుందాతనం, ఆత్మగౌరవం కలిగిన అందమైన అమ్మాయి. ఏ తరం అమ్మాయిలకైనా శకుంతల పాత్ర కనెక్ట్‌ అవుతుందని మళ్లీ ఆలోచించి ఒప్పుకున్నాను.

ఈ సినిమా కోసం గుణశేఖర్‌గారు మ్యాజికల్‌ వరల్డ్‌ను క్రియేట్‌ చేశారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షూటింగ్స్‌కి రమ్మని ఎవరూ నాకు ఫోన్‌ చేయలేదు’’ తెలిపారు సామ్