వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది సమంత

ఒకవైపు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే.. మరోవైపు  లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది సామ్

ఏప్రిల్ 14న సామ్ నటించిన ‘శాకుంతలం’చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది

ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటీ నటుల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆమె

కష్టానికి తగ్గట్టుగా పారితోషికం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది సామ్

‘నా శ్రమ చూసి ‘మేము మీకు ఇంత రెమ్యునరేషన్‌ ఇవ్వాలనుకుంటున్నాం’అని నిర్మాతలే చెప్పాలి

అంతేకానీ నాకు ఇంత పారితోషికం ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు

మన కృషి ఆధారంగా ఇది వస్తుందని నమ్ముతాను. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలి’అని పేర్కొంది సామ్