స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’.
కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గుణ శేఖర్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు.
ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్, ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సామ్.. అల్లు అర్హ కెరీర్ విషయం అల్లు అర్జున్ ప్రమేయం గురించి స్పందించింది.
కూతురు కెరీర్ విషయంలో అల్లు అర్జున్ జోక్యం చేసుకోలేడని తాను భావిస్తున్నట్లు సామ్ పేర్కొంది.
‘అర్హకు సొంత వ్యక్తిత్వం ఉంది. తన కెరీర్ ఎలా ఉండాలో ఆమె నిర్ణయించుకుంటుంది. తనలో చాలా టాలెంట్ ఉంది.
పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఈజీగా చెప్పేస్తుంది. పిల్లలందరూ అర్హ పాత్రకు కనెక్ట్ అవుతారు’ అని తెలిపింది సామ్.