సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక ప్రేమ కథా చిత్రమిది.
కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ దీన్ని రూపొందించారు.
ఇందులో శకుంతలగా సమంత నటించగా.. దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ పోషించారు.
నీలిమ గుణ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న రానుంది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితో నా చిత్రాల్లోనూ నిజమైన బంగారు ఆభరణాలే వాడుతున్నాం.
మేము ఈ ‘శాకుంతలం’లోని ప్రధాన పాత్రధారుల ఆభరణాల కోసం సుమారు 15కిలోల బంగారం వినియోగించాం.
ఆభరణాల్లో నిజమైన వజ్రాలను వాడాం. ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా సారథ్యంలో ఏడు నెలల పాటు శ్రమించి ఈ ఆభరణాలన్నింటినీ తీర్చిదిద్దారు’’ అన్నారు.