తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను.

ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే కదా.

సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన యశోద సినిమా నవంబర్ 11న థియేటర్లలో విడుదల అయ్యింది.

 ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. సమంత నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు అందిస్తున్నారు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1300 పైగా థియేటర్స్‌లో వాల్డ్ వైడ్‌గా రిలీజైంది. యశోద సినిమాతో సమంత మరో సక్సెస్ అందుకుంది.

షూటింగ్ స్పాట్లో మూవీ యూనిట్ కి సమంత కొన్ని కండిషన్లు పెట్టింది. స్పాట్లో చాలా ప్రశాంతంగా వదిలేయాలని కోరిందట.

తన జోలికి ఎవరూ రాకూడదని, ముఖ్యంగా నా డివోర్స్ కి సంబంధించిన విషయాలను ఏ ఒక్కరు కూడా అడగకూడదనే అతిపెద్ద కండిషన్ పెట్టిందని సమాచారం.

షూటింగ్లో పాల్గొన్నప్పుడు ప్రత్యేక సెక్యూరిటీతో షార్ట్ కంప్లీట్ అవ్వగానే వెంటనే సమంత మళ్ళీ తన క్యారావ్యాన్ లోకి వెళ్లిపోయేలా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారట.

ఈ షూటింగ్లో పాల్గొన్నప్పుడు సమంత చాలా మూడీగా ఉండేదట. నాగచైతన్యకు విడాకులు ఇవ్వకముందు ముందు షూటింగ్ షెడ్యూల్లో సమంత చాలా యాక్టివ్ గా ఉండేదట.