బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుండే పేరు సల్మాన్ ఖాన్. పాన్ ఇండియా లెవల్లో భారీ ఫాలోయింగ్ సంపాదిచుకున్న ఈ హీరో స్టిల్ సింగిలే.
సినిమా అప్డేట్స్ కంటే ఎక్కువగా సల్మాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరలవుతుంటాయి.
ముఖ్యంగా హీరోయిన్లతో సల్లుభాయ్ లవ్, డేటింగ్,బ్రేకప్ వంటి విషయాలే ఫిల్మ్ సర్కిల్లో ఎక్కువగా వినిపించేవి. అయితే ఏనాడు తన ప్రేమ.. పెళ్లి గురించి మాట్లాడని సల్మాన్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.తనను జాన్ అని పిలవాలనుకున్న అమ్మాయి.. ఇప్పుడు బాయ్ అని పిలుస్తుందంటూ..
పెళ్లి, పిల్లల గురించి సల్మాన్ మాట్లాడుతూ.. ” నేను ఇప్పుడు మా ఇంటికి కోడలిని కాదు.. పిల్లలను తీసుకోవాలనుకుంటున్నాను.
ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకోవాలనుకుంటున్నాను. కానీ మన భారతీయ చట్టాలు అందుకు ఒప్పుకుంటాయో లేదో చూడాలి”
అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికీ సల్మాన్ పెళ్లంటే తనకు ఇష్టం లేదనే అంటున్నారు.