ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘సలార్’.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడిగా శ్రుతిహాసన్ నటిస్తుంది.
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ వేగవంతం చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం.
కాగా జూన్ 16న విడుదల కానున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంతో పాటే ‘సలార్’ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారని చిత్ర వర్గాల సమాచారం.
ఇక ఈ చిత్రంలో మరో కీలకమైన ప్రతినాయక పాత్రలో సౌరవ్ లోకేష్ కనిపించన్నట్లు తెలిసింది.
ఈ మూవీలో విశాల్ ‘పొగరు’ చిత్రంలో ప్రతినాయికగా నటించిన శ్రియా రెడ్డి ఓ శక్తిమంతమైన పాత్రలో నటించనుంది.
శుక్రవారం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది చిత్ర బృందం.