తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
అయితే సినిమాలో (NTR 30) ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారని వార్తలు వచ్చాయి.
ఈ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సైఫ్ అలీఖాన్ నో చెప్పాడని ఓ ప్రముఖ వార్త సంస్థ తన కథనంలో పేర్కొందట.
దీనికి ప్రధాన కారణం ఈ స్టార్ హీరో రెండు ప్రతిష్ఠాత్మక సినిమాలతో బిజీగా ఉండడమే.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ లో సైఫ్ రావణుడి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ సైఫ్ మరొక తెలుగు సినిమాను ఓకే చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
‘ఆదిపురుష్’ విడుదల ముందే ‘ఎన్టీఆర్30’ షూట్ మొదలవ్వడంతో సైఫ్ ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదని అనుకుంటున్నారు.