యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 30వ సినిమాలో విలన్ ఎవరనేదానిపై క్లారిటీ వచ్చేసింది.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.
ఇప్పుడే ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో సైఫ్ అలీఖాన్ అడుగుపెట్టాడు.
దీనికి సంబధించిన ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ సైతం సెట్లోకి అడుగుపెట్టింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం #NTR30 హ్యాష్ట ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది.