నటి సాయి పల్లవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒక నిర్ధిష్టమైన నిర్ణయంతో కథలను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తున్నారామె.

ముఖ్యంగా గ్లామర్‌ షోలకు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ నటిస్తుంది సాయి పల్లవి

ఈమె డాక్టర్‌ కాబోయి యాక్టరైన సంగతి తెలిసిందే. అంతే కాదు సాయిపల్లవిలో మంచి డ్యాన్సర్‌ కూడా.

తాజాగా తన ప్రేమ అనుభవం గురించి నటి సాయి పల్లవి స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

తాను ఏడవ తరగతి చదువుతున్నప్పుడే తన సహా విద్యార్థిపై ఇష్టం ఏర్పడిందని సాయి పల్లవి తెలిపారు.

అదంటే ఏదో తెలియని ఆసక్తి కలిగిందన్నారు. ఆ విషయాన్ని అతనికి తెలియజేయడం కోసం ప్రేమలేఖను రాశానన్నారు.

అయితే దాన్ని అతనికి ఎలా అందజేయాలో తెలియక పుస్తకంలో పెట్టానన్నారు.

అయితే ఆ ప్రేమ లేఖ తన తల్లి కంట పడడంతో బాగా కొట్టినట్లు వాపోయారు. అమ్మ తనను కొట్టడం అదే మొదటిసారి, చివరిసారి కూడా అని పేర్కొన్నారు.

అప్పటి నుంచి అమ్మకు కోపం వచ్చేది ఏ పనీ చేయలేదని చెప్పారు.