గ్లామర్ రోల్స్ కు ప్రాధాన్యం ఇస్తూ సినిమాల్లో అందంగా కనిపించాలని ఎక్కువ శాతం ఇష్టపడతారు హీరోయిన్స్
సినిమాల్లోనే కాకుండా బయటకి మేకప్ లేకుండా రావడానికి ఇష్టపడరు
కానీ, తనకు మేకప్ లేకుండా నటించడమే ఇష్టమంది హీరోయిన్ సాయిపల్లవి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గున్న ఆమె సినిమాలలో మేకప్ గురించి తనకు ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది
‘తెరపై అందంగా కనిపించాలంటే చాలా ఒత్తిడి ఉండవచ్చు. మరింత అందంగా కనిపించడానికి మేకప్ సహాయం చేయదని నేను చెప్పడం లేదు
ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తే వేసుకోవచ్చు. నాకు మేకప్ లేకుండా కూడా నటించగలననే నమ్మకం ఉంది
‘నన్ను క్రమశిక్షణలో ఉంచడంలో, నా శరీరంలో ఒక విధమైన లయను తీసుకురావడంలో డ్యాన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందని నేను అనుకోలేదు
నేను సినిమా స్టార్‌ని కాదు. కేవలం నేను ఇష్టపడే దాన్ని తెరపై చూపించే అవకాశాన్ని పొందినట్లుగా భావిస్తానంతే’ అని పేర్కొంది సాయి పల్లవి