ఏ విషయంలోనైనా చాలా ఓపెన్‌గా ఉంటాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.
తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అందరితో పంచుకుంటాడు.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి, తాను ఇష్టపడ్డ అమ్మాయిల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘ప్రతి ఒక్క రియల్ లైఫ్ లోనూ ఎవరో ఒకరైనా క్రష్ ఉంటారు. నా లైఫ్ లోనూ ఒకరున్నారు.
ఇంటర్‌లో ఉన్నప్పుడు నా బెస్ట్‌ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయిని ప్రేమించా. కట్ చేస్తే.. డిగ్రీలో నేనే దగ్గరుండి ఆమెకు పెళ్లి చేశా.
ఎందుకంటే అప్పటికీ నా దగ్గర డిగ్రీ పట్టా తప్ప ఏమీ లేదు. అందుకే నా ప్రేమను త్యాగం చేశా.
ఇక సినిమాల్లోకి వచ్చాక.. .. 'తిక్క' సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసి చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. సాంగ్ షూటింగ్ సమయంలోనే ఆమెకు ప్రపోజ్‌చేశా.
కానీ ఆమె ఇచ్చిన రిప్లైకి నా హార్ట్ బ్రేక్ అయింది. సారీ తేజ్.. నాకు ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. బాధతో వెళ్లిపోయా.
ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అన్నట్లు బ్రతుకుతున్నా.