కరోనా మహమ్మారి సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి
ఇంటి నుంచి బయటకు వెళ్లలేని సమయంలో బ్యాంకులు ప్రజలకు ఇంటి నుంచి సర్వీసులు పొందేందుకు ఆన్‌లైన్‌లో ఎన్నో మార్పులు చేశాయి
ప్రజలు తమ బ్యాంకింగ్ సంబంధిత పనిని చాలా వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించేస్తున్నారు
ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు కూడా పెరిగిపోయారు
అమాయకులను ఆసరా చేసుకుని క్షణాల్లోనే బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఖాళీ చేసేస్తున్నారు
దీని కోసం నేరస్థులు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ పద్ధతుల్లో ఒకటి విషింగ్
నేరస్థులు బ్యాంకు తరపున నుంచి ఫోన్ చేస్తున్నామని వినియోగదారు ID, OTP, URN (ప్రత్యేక నమోదు సంఖ్య), కార్డ్ PIN, CVV ఇలాంటివి అడుగుతారు
ఫోన్ చేసి ఇలాంటివి అడిగారంటే వారు సైబర్ నేరగాళ్లు అని గుర్తించుకోవాలి
మీకు అలాంటి కాల్ వస్తే, దానిని బ్యాంకుకు నివేదించండి
ఏదైనా సందేశం, ఇమెయిల్ లేదా SMSలో అందించబడిన ఫోన్ నంబర్‌కు మీ వ్యక్తిగత లేదా ఖాతా వివరాలను అస్సలు ఇవ్వవద్దు