విమాన ప్రయాణాల్లో అనుకోకుండా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి
ఇలాంటి సందర్భంలో ఏ సీటులో కూర్చుంటే సేఫ్‌గా ఉంటుందో తెలుసా..
విమానంలో భద్రతపరంగా చూస్తే.. మధ్య సీటు ఎంతో సురక్షితమైందని విమానయానరంగ నిపుణులు అంటున్నారు
విమాన ప్రమాదాలు సంభవించినప్పుడు విండో సీటు, సీటింగ్ వరుస ప్రారంభంలో ఉండే సీటుతో పోలిస్తే మధ్యలో ఉండే సీటు సురక్షితమైనది
మధ్య సీట్లలో కూడా అన్ని వరుసల్లోనివి సురక్షితం కాదు.. విమాన రెక్కల్లో ఇంధనం ఉంటుంది కాబట్టి ఆ వరుసలో ఉండే మధ్య సీట్లు అంత సేఫ్ కాదు
ఎమర్జెన్సీ డోర్‌కు దగ్గరగా ఉన్న సీటు, వెనుక వరుసల్లోని మధ్య సీట్లు కూడా సురక్షితమైనవే
ప్రమాద సమయంలో త్వరగా విమానం నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది