Test Records: అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 30 టెస్ట్ సెంచరీలు.. టాప్ 5లో భారత్ నుంచి ఇద్దరు..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీ సాధించాడు.

దీంతో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 30 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ల లిస్టులో చేరాడు.

టాప్ 5 లిస్టులో ఇద్దరు భారతీయులు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

1- సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌లో మొత్తం 51 సెంచరీలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

సచిన్ కేవలం 159వ ఇన్నింగ్స్‌లో 30 సెంచరీలు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

2- స్టీవ్ స్మిత్ ఈ ఘనత సాధించేందుకు 162 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్టింది.

3- మాథ్యూ హేడెన్ 167 ఇన్నింగ్స్‌ల్లో 30 టెస్టు సెంచరీలు చేశాడు.

4- రికీ పాంటింగ్ 30 సెంచరీలు పూర్తి చేయడానికి 170 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

5- సునీల్ గవాస్కర్ టెస్టు క్రికెట్‌లో మొత్తం 34 సెంచరీలు సాధించాడు. కేవలం 174 ఇన్నింగ్స్‌ల్లో 30 సెంచరీలు సాధించాడు.