IND vs SA: సచిన్ ది గ్రేట్.. 11 ఏళ్లుగా ఆ రికార్డు అలానే..!
సరిగ్గా 11 సంవత్సరాల క్రితం, ఈ రోజున, సచిన్ టెండూల్కర్ ఓ రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఏ ఆటగాడి బ్యాగులో లేని రికార్డును బద్దలు కొట్టాడు.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ 16 డిసెంబర్ 2010న సెంచూరియన్‌లో జరిగింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 136 పరుగులకే ఆలౌటైంది.
గ్రేట్ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ తొలి డబుల్ సెంచరీ, హషీమ్ ఆమ్లా-ఏబీ డివిలియర్స్ సెంచరీల సహాయంతో దక్షిణాఫ్రికా 620/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 484 పరుగులకే ఆలౌటైంది. 50వ టెస్ట్ సెంచరీని సాధించిన సచిన్, ఈ మైలురాయిని తాకిన మొదటి, ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
జట్టు ఓటమిని తప్పించేందుకు ధోనీతో కలిసి సచిన్ తన వంతు ప్రయత్నం చేశాడు. వీరిద్దరి మధ్య ఏడో వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
కానీ, మిగతా బ్యాట్స్‌మెన్స్ త్వరగా పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 25 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 111 పరుగులతో సచిన్ నాటౌట్‌గా నిలిచాడు.